అదరగొడుతున్న అలికాజో- వుషూ క్రీడలో ఔరా అనిపిస్తున్న హైదరాబాద్ యువతి - national wushu player alikajo - NATIONAL WUSHU PLAYER ALIKAJO
🎬 Watch Now: Feature Video
Published : Mar 21, 2024, 6:05 PM IST
Interview with National Wushu player Alikajo : అమ్మాయిలకు ఆటలంటే అసక్తి ఉన్నా, పాల్గొనే వారి సంఖ్య చాలా తక్కువ. అందులోనూ మార్షల్ ఆర్ట్స్ వైపు వెళ్లే వారు అంతంత మాత్రమే. చిన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్‌లో ప్రావీణ్యం సంపాదించిన ఈ యువతి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకుంది. తాను ఎంచుకునే క్రీడా, అన్నింటికి కంటే భిన్నంగా ఉండాలనుకుంది. అందుకోసం చైనాకు చెందిన వూషూ క్రీడలో మెలకువలను వడివడిగా నేర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తోంది. మరి, ఆ యువతి నేపథ్యం ఏమిటి? ఇదివరకూ ఎన్ని పతకాలు సాధించింది. భవిష్యత్తు లక్ష్యాలేమిటో వూషూ క్రీడాకారిణి అలికాజో మాటల్లోనే తెలుసుకుందాం.
వూషూ (మార్షల్ ఆర్ట్స్) క్రీడాలో హైదరాబాద్‌కు చెందిన యువతి అలికాజో రాణిస్తోంది. ఇటీవల జాతీయ స్థాయిలో రజత పతకం సాధించింది. అందరిలా మూస క్రీడలు కాకుండా విభిన్నంగా ఆలోచిస్తూ వూషూలో దూసుకెళ్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు దేశాల క్రీడాకారులతో తలపడుతోంది. మరోవైపు జిమ్నాస్టిక్ క్రీడల్లో జడ్జిగా పలు దేశాల్లో భారత్ తరఫున సేవలు అందిస్తోంది. ఓ వైపు క్రీడా జడ్జి, మరోవైపు క్రీడాకారిణిగా రాణిస్తూ ఔరా అనిపిస్తోంది అలికాజో. రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో వూషూ క్రీడాల్లో బంగారు పతకం తేవాలనేది తన లక్ష్యమని చెబుతోంది. జాతీయస్థాయి వూషూ క్రీడాకారిణి అలికాజోతో చిట్ చాట్.