ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్లు ప్రారంభం - Indian Culinary Institute Admission - INDIAN CULINARY INSTITUTE ADMISSION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 11, 2024, 10:31 PM IST
Indian Culinary Institute Admissions: భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్ హెడ్ డాక్టర్.తిరులోగచందర్ అన్నారు.
కర్నూలులోని హోటల్ త్రిగుణ క్లార్క్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంటర్ తర్వాత విద్యార్థులు మూడు సంవత్సరాల బీబీఏ, రెండు సంవత్సరాల యంబీఏ(కలినరీ), బీఎస్పీ హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఇండియన్ కలినరీ ఇన్ స్టిట్యూట్లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఉన్నాయని, ఇక్కడ చేరిన విద్యార్థులకు దేశంలోని అన్ని రాష్ట్రాల సంప్రదాయ వంటలను నేర్పిస్తామన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో రాణించడానికి వారికి అవసరమైన మేనేజ్మెంట్ నైపుణ్యాలను నేర్పిస్తామని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్నవారు సంస్థ వెబ్సైట్ని సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చిన ఇన్స్టిట్యూట్ హెడ్ తెలిపారు. అందులో ఉన్న సమాచారం ద్వారా తమను సంప్రదించొచ్చని అన్నారు.