LIVE : ఉప్పల్ వద్ద నల్లచెరువు సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభోత్సవం - ప్రత్యక్షప్రసారం - Nallacheruvu Sewage Treatment Plant
🎬 Watch Now: Feature Video
Published : Mar 9, 2024, 6:25 PM IST
Inauguration of Nallacheruvu Sewage Treatment Plant at Uppal : సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం హెచ్ఎండీసీ కారిడార్‌కు భూమి పూజ చేసిన సీఎం రేవంత్, శుక్రవారం పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం నేడు సికింద్రాబాద్‌లోని డబుల్ ఎలివేటెడ్ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎల్బీనగర్ వద్ద బైరామల్‌గూడ కూడలిలో పై వంతెనను ప్రారంభించారు. ఇప్పుడు ఉప్పల్ వద్ద నల్ల చెరువు సీవేజీ ట్రీట్మెట్ ప్లాంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే హైదరాబాద్ డబుల్ ఎలివేటెడ్ కారిడార్‌ను రూ.1,580 కోట్ల వ్యయంతో 5.320 కిలోమీటర్ల కారిడార్ నిర్మిస్తున్నారు. ఇందులో అండర్‌గ్రౌండ్ టన్నెల్ 0.6 కిలోమీటర్లుగా ఉండగా, ఇందులో మొత్తం 131 స్తంభాలతో ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. మరోవైపు ఎల్బీనగర్లోని బైరామల్‌గూడ కూడలిలో రూ.148.5 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఇప్పుడు ఉప్పల్ వద్ద నల్లచెరువు సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.