భార్య తిట్టిందని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న భర్త - WIFE AND HUSBAND ISSUE - WIFE AND HUSBAND ISSUE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 11:01 PM IST

Husband Poured petrol and set himself on fire because of his Wife Scolding : భార్య తిట్టిందనే బాధతో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోలో పోసుకొని నిప్పంటించుకున్న ఘటన అనంతంపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఏ పని చేయకుండా నిత్యం మద్యం తాగుతూ ఉన్నాడని భార్య తిట్టాడంతో తీవ్ర మనస్థతం చెందటంతో భర్త నిప్పంటిచుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం మండలం తుంపర్తి గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి మోపిడి గ్రామంలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. గర్భవతిగా ఉన్న భార్యకు శ్రీమంతం చేయాలని భర్త నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తింది. 

ఏ పని చేయకుండా నిత్యం మద్యం తాగుతూ ఉన్నావని అనిల్ ను భార్య తిట్టింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అనిల్ కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని  నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు అనిల్​ను రక్షించి, హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. తీవ్ర గాయాలతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.