మా దారి రహదారి అంటున్న దొంగలు- హైవే వెంట మొబైల్ షాప్‌లో భారీ చోరీ - Huge Theft in Cell Shop in Prakasam - HUGE THEFT IN CELL SHOP IN PRAKASAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 4:59 PM IST
Huge Theft in Cell Shop in Prakasam District : ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రధాన రహదారి సమీపంలోని అక్షిత మెుబైల్ దుకాణంలో బుదవారం రాత్రి చోరీ జరిగింది. ఇనుప రాడ్డుతో దుకాణం షెట్టర్‌ను పగులగొట్టి దాదాపు 30 లక్షల రూపాయల విలువైన సెల్‌ఫోన్స్, 5 లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్లు యజమాని తెలిపారు. యాజమాని ఫిర్యాదు మేరకు క్లూస్ టీం సహాయంతో పోలీసులు దుండగులను గుర్తించే పనిలో ఉన్నారు. దుండగులు చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
30 Lakh Worth Mobile Phones Robbed in Ongole : సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఉదయానికి షాప్‌లో ఫోన్లు మాయమవడంతో దుకాణం యజమాని ఆందోళనతో పోలీసులను సంప్రదించాడు. దీంతో రంగంలోకి దిగిన క్లూస్‌టీం దొంగల వేటలో పడ్డారు. ఒంగోల్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ చోరీ ఘటనతో వ్యాపారులు భయాందోళనలకు గురయ్యారు.