అమ్మవారికి అలంకరించిన 30 తులాల బంగారం 100 తులాల వెండి 40 లక్షల నగదు చోరీ - Robbery in Sri Chakrapuram Temple - ROBBERY IN SRI CHAKRAPURAM TEMPLE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 24, 2024, 6:14 PM IST
Huge Robbery in Sri Chakrapuram Temple Srikakulam District : శ్రీకాకుళం ఎచ్చెర్ల మండలం కుంచాలకూర్మయ్యపేట వద్ద శ్రీ చక్రపురం దేవాలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలోని అమ్మవారి నగలు, హుండీలోని నగదు చోరీ జరిగిందని దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అమ్మవారికి అలంకరించిన 30 తులాల బంగారం 100 తులాల వెండి రూ. 40 లక్షల నగదు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. హుండీలోని నగదు మొత్తంగా సుమారు రూ.కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దొంగలు షిర్డీ సాయిబాబా మందిరం పక్కనే ఉన్న గ్రిల్స్ నుంచి అమ్మవారి ఆలయంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు పోలీసులుకు సమాచారం అందించారు.
పోలీసులు, క్లూస్ టీం వివరాలను సేకరిస్తున్నారు. అమ్మవారి వెండి కిరీటం, బంగారు ఆభరణాలు, చిన్న అమ్మవారి అభరణాలు, ఇతర వెండి సామాగ్రి, అదే విధంగా భక్తులు ఇచ్చిన నగదు పోయినట్లు పూజారి తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం వివరాలను వెల్లడిస్తామని ఆశ్రమ వర్గాలు, పోలీసులు తెలిపారు.