చేపల వలలో కొండచిలవ- వింతగా చూస్తున్న జనం - మత్సకారుడి వలలో భారీ కొండచిలువ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 21, 2024, 3:56 PM IST
Huge Python Caught in a Fisherman's Net : మత్సకారుడి వలలో భారీ కొండచిలువ చిక్కి కలకలం రేపింది. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నడకుదురు వద్ద కృష్ణానదిలో ఓ మత్స్యకారుడు చేపల కోసం వల వేశాడు. వలలో సుమారు 11 అడుగుల కొండచిలువ పడింది. దాన్ని చూసి భయపడిన మత్స్యకారుడు (Fisherman's) నదిలో వదలడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే కొండచిలువ మృతి చెందింది. కొండచిలువను కృష్ణానది కరకట్ట పైకి తేవడంతో అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న వాహనదారులు వింతగా చూస్తున్నారు.
Python Caught in a Fisherman's Net In Krishna District : ముందు కొండ చిలువను చూసిన మత్స్యకారుడు భయపడి వలను కత్తిరించి కొెండచిలువను (Python) వదులుదామని ప్రయత్నించినట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే కొండ చిలువ ప్రాణాలతో లేదని వారికి తెలిసిందంటున్నారు మత్స్యకారులు. వల నుంచి కొండచిలువను కరకట్ట పైకి తెచ్చే ప్రయత్నం చేశారు. వారు దాన్ని పైకి తీస్తుండగా ఆ వైపు వెళ్లే జనం అంతా వింతగా కొండచిలువను చూడసాగారు.