LIVE : హైదరాబాద్​లో భారీగా డ్రగ్స్ పట్టివేత - వివరాలు వెల్లడిస్తున్న రాజేంద్రనగర్​ డీసీపీ - Hyderabad DCP Revealing Huge drug - HYDERABAD DCP REVEALING HUGE DRUG

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 4:33 PM IST

Updated : Jul 15, 2024, 4:55 PM IST

DCP Srinivas Revealing Huge drug bust in Hyderabad LIVE : రాజేంద్ర నగర్ పీఎస్ పరిధిలో భారీగా డ్రగ్స్​ను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ సీపీ కార్యాలయం నుంచి డీసీపీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించి, వివరాలను వెల్లడిస్తున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు అరెస్టు కాగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. రూ. 35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా డ్రగ్స్ ముఠా నిందితుల నుంచి రెండు పాస్‌పోర్టులు, 10 మొబైల్స్, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో మాదకద్రవ్యాలు ప్రవేశించేందకు వీల్లేదన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్‌ మూలాలని పెకిలించే లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. డెకాయ్‌ ఆపరేషన్స్‌తో సూత్రధారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేపట్టారు. అంతరాష్ట్ర ముఠాలను పట్టుకునేందుకు వెళ్లే పోలీసులు తప్పనిసరిగా ఆయుధాలు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించటం సహా లక్షలాది మంది యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న మత్తు స్మగ్లర్లను వదలబోమని టీజీన్యాబ్‌ అధికారులు స్పష్టంచేశారు. 
Last Updated : Jul 15, 2024, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.