శ్రావణ మాసం వేళ పూల ధరలకు రెక్కలు - ఆ పువ్వులకు భారీ డిమాండ్​ - FLOWER PRICES INCREASE at hyderabad

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 9:53 AM IST

thumbnail
ఆకాశాన్నంటుతున్న పూల ధరలు - మార్కెట్లో ఆ పువ్వులకు భారీ డిమాండ్​ (ETV Bharat)

Flower Prices Increases on eve of Varalakshmi Vratham : శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని నగరంలోని పూలమార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పూల కోసం నగర వాసులు మార్కెట్లకు బారులు తీరారు. బంతి, చామంతి, కనకాంబరాలు, తామరపూలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. నిత్యం 30 రూపాయలకు జత దొరకే తామరలు ఈరోజు దాదాపు 100 రూపాయలకు చేరాయి. ఇక బంతి పూలు కేజీ రూ. 100 నుంచి 150 వరకు ఉండగా చామంతుల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి.  

పువ్వుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న ప్రజలు : చామంతి పావుకేజీ దాదాపు రూ.400 వరకు పలుకుతున్నాయి. మరోవైపు అమ్మవారికి అలంకరించే పూల మాలలకు మరింత గిరాకీ ఏర్పాడింది. ఇక పూజలో వాడే మాలలను మరింత అందంగా తయారు చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచారు. అరటి కొమ్మలు, తమలపాకులు, అలంకారానికి వినియోగించే అన్ని రకాల పువ్వులను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.