గృహ నిర్మాణ నిధులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం దారి మళ్లించింది: మంత్రి పార్థసారథి - Kolusu Parthasarathy Press Meet
🎬 Watch Now: Feature Video
Housing Minister Kolusu Parthasarathy Press Meet: గృహ నిర్మాణ నిధులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించడంతో పాటు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు సైతం ఇవ్వలేదని ఆయన ఆక్షేపించారు. 26 లక్షల ఇళ్లలో కేవలం 6 లక్షలు మాత్రమే కట్టారని మంత్రి అన్నారు. మళ్లించిన నిధులు దేనికి ఉపయోగించారనేది తెలియట్లేదని పార్థసారథి తెలిపారు. ఆ నిధులు రుషికొండ ప్యాలెస్‌కు మళ్లించారా? లేదా ఇతర అంశాలకా? అన్నది తేలుస్తామని మంత్రి అన్నారు.
పెండింగ్‌లో ఉన్న 13 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తాము తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లబ్ధిదారుల పేరిట రుణాలు కూడా తీసుకుందని చెప్పారు. జగనన్న కాలనీల్లో కూడా రాష్ట్ర వాటా నిధుల్లేవని, కేంద్రానివే మాత్రమే ఉన్నాయని మంత్రి పార్థసారథి వివరించారు. పేదల జీవనోపాధికి, మౌలిక వసతులకు అవకాశం లేని చోట లేఔట్లు వేశారని విమర్శించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన ఇళ్లను కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు.