Minister Lokesh Help To Cancer Patient In Guntur District : క్యాన్సర్ వ్యాధితో గత కొంత కాలంగా పోరాటం చేస్తున్న వ్యక్తికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. వివరాల్లోనికి వెళ్తే గుంటూరు జిల్లా ధర్మకోటకు చెందిన గార్లపాటి బ్రహ్మయ్య క్యాన్సర్ వ్యాధి బారినపడి గత కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మెరుగైన వైద్యానికి సుమారు 5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.
బ్రహ్మయ్య (క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు) ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఆదుకోవాలని బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా మంత్రి నారా లోకేశ్‌కు ఇటీవల విజ్ఞప్తి చేశారు. దీనికి తక్షణమే స్పందించిన మంత్రి లోకేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3 లక్షల ఎల్వోసీ మంజూరు చేసి అండగా నిలిచారు. సాయం కోరిన వెంటనే స్పందించి ప్రాణాలు నిలిపిన లోకేశ్‌కు బ్రహ్మయ్య, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి నారా లోకేశ్ సాయం - గల్ఫ్‌లో చిక్కుకున్న మహిళ క్షేమంగా ఇంటికి