LIVE: హోంమంత్రి అనిత మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - HOME MINISTER ANITHA PRESSMEET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2024, 5:38 PM IST
|Updated : Nov 7, 2024, 5:56 PM IST
LIVE: జగన్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మన రాష్ట్ర పరువు, ప్రతిష్ఠను జగన్ ఎప్పుడో తీసేశారని తెలిపారు. రాజకీయ ముసుగులో వైఎస్సార్సీపీ నేతలు అనేక దారుణాలకు పాల్పడ్డారని తెలిపారు. ఐదేళ్ల పాలనలో ఏం చేశారనే దానిపై జగన్ మాట్లాడాలన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఎన్ని నేరాలు జరిగాయో లెక్కలు చూడండని అన్నారు. ఎన్ని నేరాలు జరిగినా జగన్ ఐదేళ్లపాటు మాట్లాడలేదన్న అనిత, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినా జగన్ పట్టించుకోలేదని అన్నారు. ఐదు నెలల్లో ఏదో జరిగిపోయిందని అభాండాలు వేస్తున్నారని, వైఎస్సార్సీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగాయని హోంమంత్రి అనిత అన్నారు. అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడారని, దుర్గమ్మ గుడికి వెళ్లకుండా ఎలా అడ్డుకున్నారో చూశామన్నారు. డీజీపీ ఆఫీసు పక్కనున్న టీడీపీ కార్యాలయంపై దాడి చేశారన్నారు. పెన్నులు, నల్లబట్టలు వేసుకున్నా సభలకు రానీయలేదని అనిత అన్నారు. జగన్ హయాంలో పరదాలు కట్టుకుని సమావేశాలు పెట్టుకున్నారన్నారు. అనిత లైవ్ మీ కోసం
Last Updated : Nov 7, 2024, 5:56 PM IST