పింఛన్ల పంపీణీకి అధికారుల గైర్హాజరు- హోం మంత్రి ఆగ్రహం - చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు - Home Minister Angry on Officials

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 7:36 PM IST

Home Minister Anita Angry on Officials in Pension Distribution Program: కొందరు అధికారులు వైఎస్సార్​సీపీ వాసనలు వీడలేకపోతే బాధ్యతల నుంచి వైదొలగాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. దగ్గరుండి పేదలకు పింఛన్లు పంపిణీ చేయించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర మంత్రి వచ్చినప్పుడు అధికారులు ఎందుకు రాలేదని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెద్దగుమ్మలూరులో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో హోంమంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి తహసీల్దార్, ఎంపీడీఓ రాకుండా పంచాయతీలో ఉండటంపై నిప్పులు చెరిగారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. పింఛన్‌దారులతో కలిసి పంచాయతీ కార్యాలయంలో హోంమంత్రి పంక్తి భోజనాలు చేశారు. పేదలను ఆదుకునే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి పింఛన్లను పెంచి మొత్తం బకాయిలతో కలిపి చెల్లింస్తుందని అన్నారు. ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. కలెక్టర్‌కు ఫోన్ చేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.