మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వం కీలక నిర్ణయం - కేసులు ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 16, 2024, 12:39 PM IST
Home Department Orders to Withdraw Cases Against Municipal Workers: సమ్మె చేస్తున్న సమయంలో మున్సిపల్ కార్మికులపై పోలీసులు నమోదైన కేసులను (Cases Against Municipal Workers) కొట్టేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మె విరమణ చేసే సమయంలో తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కార్మికులపై నమోదైన 6 కేసులను కొట్టేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేసులు ఉపసంహరణ: మున్సిపల్ కార్మికులు 2023 డిసెంబరు 26వ తేదీ 2024 జనవరి 11 వరకూ చేసిన సమ్మె (Municipal workers strike in AP) కాలంలో మున్సిపల్ అధికారుల ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు డీజీపీకీ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి లేఖ (Municipal Administration Special Chief Secretary Sri Lakshmi) రాశారు. విజయవాడ, విశాఖ, నరసరావుపేట, గుంటూరు, ఏలూరు, కడపలలో కార్మికులపై నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ తెలిపింది.