నెక్లెస్‌రోడ్‌లో సందడిగా హోలీ సెలబ్రేషన్స్ - హుషారెత్తించేలా యువత చిందులు - Holi Celebrations in Hyderabad - HOLI CELEBRATIONS IN HYDERABAD
🎬 Watch Now: Feature Video


Published : Mar 25, 2024, 4:11 PM IST
Holi Celebrations at Necklace road in Hyderabad : కులమతాలకు అతీతంగా దేశమంతా జరుపుకునే రంగుల పండుగ హోలీ. ఇవాళ ఈ పండుగను హైదరాబాద్ వాసులు ఘనంగా జరుపుకున్నారు. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో రంగీత్ ఉత్సవంలో యువత ఉల్లాసంగా, ఉత్సాహంతో పాల్గొని సందడి చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్న వారితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వారి ఉత్సాహానికి సంగీతం ఇంకాస్త జోష్ పెంచింది. హుషారెత్తించే సినీ గీతాలకు అణుగుణంగా నృత్యాలు చేస్తూ హోరెత్తించారు.
Holi Celebrations in Hyderabad : ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ డ్యాన్స్‌లో వారు ఆనందంగా చిందులేశారు. అంతా కలిసి ఒకచోట ఈ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం స్నేహితులు, కుటుంబసభ్యులతో సైతం హోలీ జరుపుకుంటామని, కెమికల్స్ లేని రంగులు మాత్రమే చల్లకుంటామని తెలిపారు. ధర ఎక్కువ ఉన్నా, ఆర్గానిక్స్ రంగులు మాత్రమే ఉపయోగిస్తామని పేర్కొన్నారు.