thumbnail

భారత గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో కీలక ఘట్టం - విశాఖ హిందుస్థాన్​ షిప్​యార్డు ముందడుగు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Green Hydrogen news Today: భారత గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విశాఖ హిందుస్ధాన్ షిప్ యార్డు (హెచ్ఎస్ఎల్) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ముందడుగు వేసింది. సముద్రంలో ఉపయోగించే ఈ పరికరాలకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ బ్యాటరీల ఉత్పత్తి టెక్నాలజీని హిందుస్ధాన్ షిప్ యార్డు సిద్ధం చేసింది.  

కొరియన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అసోసియేట్, భారతీయ పరిశ్రమ భాగస్వామి-లోటస్ వైర్‌లెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఈ టెక్నాలజీని హెచ్​ఎస్​ఎల్ (హిందుస్థాన్ షిప్ యార్డు) రూపొందించింది. భారతీయ సముద్ర రంగానికి అత్యాధునిక హైడ్రోజన్ ఇంధన సెల్ టెక్నాలజీని పరిచయం చేసేందుకు ఇది తోడ్పడుతుందని హెచ్ఎస్ఎల్ వెల్లడించింది. హైడ్రోజన్ ఇంధన బ్యాటరీలు 250 kw నుంచి 2 MW వరకు తయారీకి ఈ టెక్నాలజీ ఉపకరిస్తుందని ప్రకటించింది. పూర్తి సురక్షితంగా వివిధ సముద్ర ఉపకరణాలకు సరిపోయే రీతిలో వీటిని సిద్ధం చేసుకునే అవకాశం ఉందని వివరించింది. సంప్రదాయ డీజిల్ తో నడిచే వ్యవస్థలకు స్ధిరమైన ప్రత్యామ్నాయంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ సాంకేతికత పని చేస్తుందని తెలిపింది. సముద్రపు పరికరాలకు, వాటి అవసరాలకు సరిపడా ఈ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ఉత్పత్తికి అవసరమైన సాంకేతికను అందిస్తామని హిందుస్థాన్ షిప్ యార్డు వెల్లడించింది. ఇంధన కణాలతో భారతదేశ  సముద్రపు భవిష్యత్తును శక్తివంతం చేసే దిశగా ఒక మార్గదర్శక అడుగుగా దీనిని అభివర్ణించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.