Diwali Shopping in Vijayawada : వెలుగుల పండుగ దీపావళి వచ్చేస్తోంది. ఇళ్లను దీపాల కాంతులతో నింపేందుకు మహిళలు సిద్ధం అవుతున్నారు. దీపావళి మరో నాలుగు రోజుల సమయం ఉన్నా ప్రజలకు కావాల్సిన సామాగ్రి అందుబాటులోకి వచ్చేసింది. విజయవాడలోని ప్రధాన మార్కెట్లలో ప్రమిదలు, కొవ్వొత్తులు దర్శనమిస్తున్నాయి. భిన్న ఆకృతుల్లో ప్రమిదలు కొనుగోలు దారులను ఆకట్టుకుంటున్నాయి. నీళ్లలో తేలియాడే దీపాలు, పూలను తలపించే కొవ్వొత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దైవారాధన కోసం ప్రమిదలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
వివిధ ఆకృతుల్లో ప్రమిదలు : దీపావళి అంటేనే దీపాల పండుగ. ఇంటి ముందు దీపాలు పేర్చి, టపాసులు కాల్చుకుని సంబరంగా జరుపుకునే పండగే దీపావళి. ఒకప్పుడు సాంప్రదాయ పద్ధతుల్లో మట్టి ప్రమిదల్లో నూనె పోసి దీపం వెలిగించే వారు. కానీ నేడు ఈ వెలుగుల పండగను మరింత ఆకర్షణీయంగా జరుపుకుంటున్నారు. విభిన్న ఆకృతుల్లో ఉన్న ప్రమిదలు వెలిగించి ఇంటికి కొత్త కాంతులు తెస్తున్నారు మహిళలు. ఇప్పటికే దీనికి కావాల్సిన ఒత్తులు, నూనె ఇతర సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు. సాంప్రదాయ పద్దతిలో దీపావళి పండుగను జరుపుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పండుగకు నాలుగు రోజుల నుంచే తమకు కావాల్సిన సామాగ్రి కోసం మహిళలు మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వివిధ ఆకృతుల్లో ప్రమిదలు అందుబాటులోకి వచ్చాయని మహిళలు చెబుతున్నారు.
దీపావళి షాపింగ్ చేయాలా? ఈ 6 స్మార్ట్ టిప్స్‌తో - బోలెడు డబ్బులు ఆదా చేసుకోండిలా!
ఆశాభావం వ్యక్తం చేస్తున్న వ్యాపారస్థులు : మహిళలల ఆభిరుచులకు అనుగుణంగా వ్యాపారస్థులు విభిన్నమైన ప్రమిదలు, కొవ్వొత్తులు, వివిధ సామాగ్రిని రాజస్థాన్, గుజరాత్ తోపాటు వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దివ్య రంగవల్లికలతో దీపావళిని దేదివ్యమానంగా జరుపుకునేందుకు రకరకాల ప్రమిదలను వ్యాపారస్థులు విక్రయిస్తున్నారు. దైవారాధనకు అలంకరించినట్లు కొన్ని ప్రమిదలు, చక్కటి రంగులు అద్దుకుని మరికొన్ని ప్రమిదలు ఇలా ఒకటా రెండా ఎన్నో వైవిద్యమైన ప్రమిదలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాది అమ్మకాలు నత్తనడకన ఉన్నాయని ఈ ఏడాదైన అనుకున్న స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని వ్యాపారస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం దీపావళి పండుగ కోసమే కాకుండా పండుగ అనంతరమూ ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఈ దీపాలు ఉపయోగపడతాయి. దీంతో కొనుగోలుదారులు ఈ ప్రమిదలు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మార్కెట్లో గతంతో పోలిస్తే దీనికి గిరాకీ పెరిగింది.
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి బుకింగ్స్ - ఎప్పటినుంచంటే!
దీపావళి స్పెషల్ - నవంబర్ 1న 'ముహురత్ ట్రేడింగ్' - ఒక గంట మాత్రమే!