మండుతున్న ఎండలు - పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు - high temperature in AP

🎬 Watch Now: Feature Video

thumbnail

Temperature in Andhra pradesh: ఏపీలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏపీలో ( High temperature ) అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. అనంతపురం జిల్లా తరిమెలలో 44.2 డిగ్రీలు రికార్డైనట్టు వాతావరణశాఖ తెలిపింది. కడప జిల్లా బలపనూరు 43.8 డిగ్రీల మేర, అనకాపల్లి జిల్లా రావికమతం 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డైనట్టు అధికారులు వెల్లడించారు. పల్నాడు జిల్లా రావిపాడులో 43.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రత రికార్డైంది.నెల్లూరు జిల్లా కసుమూరులో 43.7 డిగ్రీల, పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో 43.6, విజయనగరం జిల్లా ధర్మవరంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు ఏపీ విపత్తు నిర్వహణా సంస్థ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 36 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 82 మండలాల్లో వడగాల్పులు వీచినట్టు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.