పోస్టల్‌ బ్యాలెట్లపై వైఎస్సార్​సీపీ హైకోర్టులో పిటిషన్‌ - తీర్పు రేపటికి వాయిదా - High Court on Postal Ballots

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 10:41 PM IST

thumbnail
పోస్టల్‌ బ్యాలెట్లపై వైఎస్సార్​సీపీ హైకోర్టులో పిటిషన్‌ - తీర్పు రేపటికి వాయిదా (ETV Bharat)

High Court Adjourned Judgment on YSRCP Petition on Postal Ballots: పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో వైఎస్సార్​సీపీ వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును శనివారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 6 గంటలకు తీర్పు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటీవల పోస్టల్‌ బ్యాలెట్‌పై గెజిటెడ్‌ ఆఫీసర్‌ సంతకముంటే సరిపోతుందని 13 ఏపై అటెస్టింగ్‌ అధికారి పేరు, వివరాలు లేకున్నా చెల్లుతుందని ఈసీ తెలిపింది. గెజిటెడ్‌ ఆఫీసర్‌ పేరు, పూర్తి వివరాలు లేకున్నా పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుతుందని ఈసీ స్పష్టం చేసింది. అయితే పోస్టల్‌ బ్యాలెట్లపై ఈసీ ఇచ్చిన ఆదేశాలపై వైఎస్సార్​సీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. 

ECI Clarity on Postal Ballots Counting : పోస్టల్ బ్యాలెట్​ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్​పై ఎన్నికల అధికారి సీల్​ లేకపోయినా సదరు బ్యాలెట్​ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏపై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది. పోస్టల్ బ్యాలెట్​పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్​ను ధృవీకరించేదుకు రిజిస్టర్​తో సరిపోల్చుకోవాలని వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం సీపై ఎలెక్టర్ సంతకం లేదని సదరు బ్యాలెట్​ను తిరస్కరించరాదని ఈసీ ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.