ఎన్నికల ప్రచారంలో సినీ నటి ఖుష్బూ - కిషన్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞాప్తి - Kushboo Support Kishan Reddy - KUSHBOO SUPPORT KISHAN REDDY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-04-2024/640-480-21331631-thumbnail-16x9-kusbhu-campaign.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Apr 27, 2024, 8:22 PM IST
Heroine Kushboo Election Campaign in Secunderabad : రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో నాయకులు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులకు మద్దతుగా స్టార్ క్యాంపెయినర్లు ఓటర్లను ఆకర్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిషన్‌రెడ్డికి మద్దతుగా సినీ నటి ఖుష్బూ ప్రచారం చేశారు.
Heroine Kushboo Support Kishan Reddy : సికింద్రాబాద్‌లోని షేక్‌పేట్‌లో ఉన్న శివాజీ చౌక్ దగ్గర శివాజీ విగ్రహానికి ఖుష్బూ పూలమాల వేశారు. అనంతరం కిషన్‌రెడ్డితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఆమెను చూసేందుకు స్థానిక నేతలతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరోసారి తమ అమూల్యమైన ఓటును కిషన్‌రెడ్డికి వేయాలని ఓటర్లను కోరారు. కమలం పార్టీ గెలిస్తే సికింద్రాబాద్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని తెలిపారు. అనంతరం తన అభిమానులకు అభివాదం చేస్తూ మరింత ఉత్సాహపరిచారు.