కర్నూలులో హెబ్బా పటేల్ సందడి - చూసేందుకు పోటీ పడ్డ అభిమానులు - heroine hebah patel in kurnool - HEROINE HEBAH PATEL IN KURNOOL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 23, 2024, 10:44 PM IST
Heroine Hebah Patel in Kurnool: కర్నూలులో హీరోయిన్ హెబ్బా పటేల్ గురువారం సందడి చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో కుమారి 21ఎఫ్ ఫేమ్ హీరోయిన్ హెబ్బా పటేల్ సందడి చేశారు. పట్టణంలోని ఆలూరు రోడ్డులో వీ.ఎస్.బీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ ఎగ్జిబిషన్ సేల్కు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. పలు వస్త్రాలతో మీడియాకు ఫోజులిచ్చిందీ ముద్దుగుమ్మ. గతంలో ఒకసారి కర్నూలుకు వచ్చానని ఆమె గుర్తు చేసుకున్నారు. రెండు నెలల పాటు వస్త్ర ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కర్నూలు విచ్చేసిన హెబ్బా పటేల్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.
కొద్ది రోజుల క్రితం కూడా హెబ్బాపటేల్ కర్నూలుకు విచ్చేసింది. అప్పుడు యాంకర్ అనసూయ భరద్వాజ్‌తో కలిసి హీరోయిన్ హెబ్బా పటేల్ వచ్చారు. అప్పుడు కూడా నగరంలోని ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో తనకు ఉగ్గాని, బజ్జీలు అంటే ఎంతో ఇష్టమని యాంకర్ అనసూయ తెలిపారు.