నిండుకుండలా రైవాడ జలాశయం - Heavy Flood to Raiwada Reservoir - HEAVY FLOOD TO RAIWADA RESERVOIR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2024, 12:48 PM IST
Heavy Flood to Raiwada Reservoir at Anakapalli : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో రైవాడ జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి 18 వందల క్యూసెక్కుల వరద నీరు చేరింది. దీంతో జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్ల కాగా ఈ ఉదయానికి 113.80 మీటర్లకు చేరుకుంది. అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ఒక గేటు ఎత్తి దిగువ శారద నదిలోకి 18 వందల క్యూసెక్కులను విడుదల చేశారు. శారద నదీ పరీవాహక ప్రాంతాలైన దేవరాపల్లి, కె. కోటపాడు, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.
నీటిమట్టం పెరిగితే మరింత అదనపు నీటిని దిగివకు విడుదల చేస్తామని జలాశయం డీఈఈ సత్యం నాయుడు తెలిపారు. నీటి విడుదలతో రైవాడ జలాశయం కనువిందు చేస్తుంది. ప్రకృతి రమణీయమైన దృష్యాల నడుమ జలాశయం ఉప్పొంగింది. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.