LIVE : మెదక్​ లోక్​సభ నియోజకవర్గ నేతలతో హరీశ్​రావు సమావేశం - Lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 2:08 PM IST

Updated : Apr 11, 2024, 2:58 PM IST

Harishrao meeting with Medak Lok Sabha Constituency : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల తర్వాత ఓటమి చవిచూసిన బీఆర్​ఎస్​ పార్టీ లోక్​సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ తమ ప్రాబల్యాన్ని చాటి చెప్పాలని గులాబీ దళం కోరుకుంటుంది. అందులో భాగంగా వరుసగా పార్టీ శ్రేణులతో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధినేత కేసీఆర్​ పంట పొలాల పరిశీలన పేరుతో పొలం బాట పట్టి మళ్లీ ప్రజల్లోకి బీఆర్​ఎస్​ను తీసుకెళ్లాలని చూస్తున్నారు. కేసీఆర్​ ఫాంహౌస్​లో ఎప్పటికప్పుడు బీఆర్​ఎస్​ ముఖ్యనేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. మరోవైపు కేటీఆర్​, హరీశ్​రావు 17 పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభ్యర్థులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్టీలోని చాలా మంది సీనియర్​ నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు నూతనోత్తేజం ఇస్తూ బీఆర్​ఎస్​ అగ్రనాయకత్వం వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో హరీశ్​రావు మెదక్​ లోక్​సభ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్​ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Last Updated : Apr 11, 2024, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.