వైఎస్సార్సీపీ నాయకుల చర్యలకు క్రీడాకారులు బలి : టీడీపీ నేత కొల్లు రవీంద్ర - అధికార పార్టీ చర్యలకు క్రీడాకారులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 8:55 PM IST

Hanuma Vihari Removed Captain Responded Kollu Ravindra : అధికార పార్టీ దుర్మార్గాలకు పారిశ్రామికవేత్తలే కాదు క్రీడాకారులు కూడా బలైపోతున్నారని అందుకు నిదర్శనం హనుమ విహారినే అని టీడీపీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైపీసీ నాయకుడు కుమారుడి కోసం హనుమ విహారిని రంజీ కెప్టెన్సీ నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు హనుమ విహారి జీవితంలో ఆంధ్రా జట్టుకు ఆడబోనని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేయడం బాధాకరమని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన అల్లుడు శరత్​ చంద్రా రెడ్డి ఆంధ్రా క్రికెట్​ అసోసియేషన్​ను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తుందని కొల్లు రవీంద్ర ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. యువతను క్రీడల్లో భాగస్వామ్యం చేసి రాష్ట్రంలో ఉన్న క్రికెట్​ స్టేడియాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.