శామీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - వైరల్‌గా మారిన సీసీటీవీ ఫుటేజ్ - Turkapalli Road accident video - TURKAPALLI ROAD ACCIDENT VIDEO
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-07-2024/640-480-22065847-thumbnail-16x9-turkapally.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jul 28, 2024, 9:24 AM IST
Turkapally Road accident video : మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలంలోని తుర్కపల్లి - మజీద్‌పూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇన్నోవా కారు హైదరాబాద్ వైపు మీతిమీరిన వేగంతో వస్తూ అదుపుతప్పి డివైడర్ పై నుంచి ఎగిరి మరోవైపు రహదారిపై పడింది. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. మృతులు హకీంపేట్ కు చెందిన శేఖర్ మోహన్ వాలే, మౌలాలి ప్రాంతానికి చెందిన మలావత్ దీపికగా పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాద సమయంలో మోహన్ కారు నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కారు డివైండర్ దాటి అవతలి రోడ్డుకు వెళ్లింది. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ ఫార్మా కంపెనీ బస్సును ఢీకొట్టింది. అనంతరం గాలిలో ఎగిరి రహదారిపై పడడంతో వెనుకాలే వస్తున్న ఆర్టీసీ బస్సు అతనిపై నుంచి వెళ్లింది. ఈ ఘటన అంతా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లి పోగా ఫార్మా కంపెనీ బస్సు రోడ్డు పక్కకు దూసుకెల్లింది. బస్సులో ఉన్న ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరో పది మందికి స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.