టీడీపీ అభ్యర్థి నామినేషన్‌కు పోలీసులు అడ్డంకులు - దారి మళ్లింపునకు యత్నం - Venigandla Ramu Nomination - VENIGANDLA RAMU NOMINATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 23, 2024, 1:48 PM IST
Police Restriction to Gudivada TDP Candidate Venigandla Ramu Nomination : కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్‌కు పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళవారం నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరి వెళ్లగా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ఏలూరు రోడ్డు బొమ్మరిల్లు థియేటర్ వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టారు. దీంతో తెలుగుదేశం నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముందస్తుగానే ర్యాలీ రూట్ మ్యాప్‌ను ఆర్డీవోకు అందించామన్న టీడీపీ నేతల వాదనలతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలోనే లీలామహల్ సెంటర్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.
వైసీపీ నాయకుల సూచనలతోనే టీడీపీ ర్యాలీని దారి మళ్లిస్తున్నారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ పట్టణంలో యథావిధిగా ర్యాలీ కొనసాగింది. అనంతరం గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ నాయకులు లేని ఆంక్షలు టీడీపీ నేతలకు ఎందుకు అని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.