పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌లో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం- ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగులు - POSTAL BALLOT voting problem in AP
🎬 Watch Now: Feature Video
Postal Ballot Voting Problem in AP : ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహణలో కృష్ణాజిల్లా ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లాలోని పోస్టల్ బ్యాలెట్లో పలువురి ఓట్లు గల్లంతయ్యాయి. చాలామంది ఉద్యోగులు ఒక జిల్లాలో నివాసం, మరో జిల్లాలో విధి నిర్వహణలో ఉన్నారు. డ్యూటీ ఎక్కడుంటే అక్కడ ఓటు వేసుకోవచ్చని అధికారులు గతంలో తెలిపారు. ఇప్పుడు నివాసం స్థలం ఉన్న చోటే ఓటు వేయాలని ఎన్నికల అధికారులు తెలిపారు. దీనిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై పోలీసులతో సహా పలు విభాగాల ఉద్యోగులు మండిపడ్డారు. తమ ఓట్లు అసలు ఎక్కడా ఉన్నయో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టర్ తక్షణమే స్పందించి తమకు ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని ఉద్యోగుల విజ్ఞప్తి చేశారు.
అయితే రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో గందరగోళం నెలకొంది. ఫాం-12 సమర్పించినా జాబితాలో పేర్లు గల్లంతవ్వడంపై పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంపై నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఓట్లు చెల్లకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో సమస్యలపై స్పందించిన సీఈఓ ముకేశ్‌కుమార్ మీనా ఈ నెల 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.