చిన్నపాటి వర్షానికే బుగ్గన ఇలాకాలో నిర్మించిన భవనాలు నీటిపాలు! - Govt Buildings Submerged - GOVT BUILDINGS SUBMERGED
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 7, 2024, 4:47 PM IST
Govt Buildings Submerged: మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత ఇలాకాలో నిర్మించిన ప్రభుత్వ భవనాల్లోకి నీరు చేరాయి. కేవలం చిన్నపాటి వర్షానికే భవనాల్లోకి నీరు రావడంపా స్థానికులు నోరెళ్లబెడుతున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం హెచ్ కొట్టాలులో బుగ్గన హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి సచివాలయం, రైతు భరోసా, అంగన్వాడీ, పాలశీతల కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు నిర్మించారు. నిన్న చిన్నపాటి వర్షం కురవడంతో ఆ భవనాలన్ని నీట మునిగాయి. కోట్లాది రూపాయాలు ఖర్చు చేసి, ప్రజలకు ఉపయోగం లేకుండా ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదోమాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా జగనన్నకాలనీల పేరుతో హాడావిడి చేసిన ప్రాంతాలు కూడా చిన్నపాటి వర్షానికే నీట మునగడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సరైన ప్రణాళిక లేకుండా ప్రజలకు ఇచ్చిన ఈ స్థలాల్లో ఉండలేక, ప్రజలు ఇతరు ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఆ ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చీకటి పడితే గంజాయి బ్యాచ్, మందు బాబులు ఈ ప్రాంతంలో రెచ్చిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు.