ఉద్యోగుల అంశంలో లోకేశ్​పై విసుర్లు- జగన్​పై పొగడ్తలు! కోడ్ ఉల్లంఘిస్తూ ప్రెస్​మీట్ పెట్టిన చంద్రశేఖర్ రెడ్డి - Chandrasekhar Reddy - CHANDRASEKHAR REDDY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 8:06 PM IST

Government employees Unions Welfare Adviser : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ప్రభుత్వ సలహదారులు రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తూ నియమావళిని యధేచ్ఛగా స్తున్నారు. ఉద్యోగ సంఘాల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి నేరుగా సచివాలయంలోనే మీడియా సమావేశం నిర్వహించి నిబంధనల్ని తుంగలో తొక్కారు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఉద్యోగులను బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగులు ప్రభుత్వం చేసిన రూల్స్ పాటిస్తారు కానీ ప్రతిపక్షాలు సూచించిన విధంగా కాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులు శాస్వతంగా ఉంటారని, ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని తెలిపారు. ఉద్యోగులు, గ్రామ సచివాలయ వ్యవస్థ అంతా ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు.  

లోకేష్ బెదిరిస్తే ఇక్కడెవరూ బెదిరేవారు లేరని చంద్రశేఖర్ రెడ్డి  రాజకీయపరమైన సవాళ్లు విసిరారు. ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగులను నియమించొద్దని చెప్పటానికి టీడీపీ ఎవరని ఆయన ప్రశ్నించారు. జూన్ నెలలో పీఆర్సీ నివేదిక వచ్చే అవకాశముందని ఆ తర్వాతే వేతనాల పెంపుపై నిర్ణయం ఉంటుందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉద్యోగులకు రావాల్సిన డీఏలు ఇచ్చారని తెలిపారు. ఉద్యోగ నేతలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు ఓర్వలేరని విమర్శించారు.  రాబోయే ఎన్నికల్లో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.