ఐబీ సిలబస్​పై అధ్యయనానికి ₹.4.86 కోట్లు - ఇంటర్నేషనల్ బాక్యులరేట్​తో ప్రభుత్వం ఎంఓయూ - vijayawada news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 12:21 PM IST

Government Agreement with International Baccalaureate Institute : పాఠశాలలో అత్యున్నత ప్రమాణాలు తీసుకురావడం కోసం ఇంటర్నేషనల్ బాక్యులరేట్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని 10వ తరగతి, ఇంటర్మీడియట్​ పాఠ్యాంశాలను సమ్మిళితం చేసేలా ధృవపత్రాలను జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై అధ్యయనం చేయాలని పేర్కొంది.

ఐబీ సిలబస్​ అమలుకు తగిన ప్రమాణాలు ఉన్న పాఠశాలను గుర్తించి ఆరు నెలల్లో వాటిపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం సృష్టం చేసింది. ఆరు నెలల అధ్యయనం కోసం రూ. 4.86 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పాఠశాల విద్యాశాఖ ద్వారా అధ్యయనం, సహకార ఒప్పందం తదితర వ్యయాన్ని భరించాలని ఆదేశాలు జారీ చేసింది. 2036 సంవత్సరం వరకు వివిధ ప్రణాళికల ద్వారా రాష్ట్రంలో ఐబీ సిలబస్​ అమలు చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం ఎస్​సీఆర్​టీతో పాటు ఐబీ సంస్థకు చెందిన 26 మంది నిపుణులతో కమిటీ వేయనున్నట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.