స్వస్థలానికి గోపీకృష్ణ మృతదేహం- విలపిస్తున్న కుటుంబ సభ్యులు - Gopikrishna Body Reached Yazali - GOPIKRISHNA BODY REACHED YAZALI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 10:32 AM IST

Gopikrishna Body Reached Yazali Village Bapatla District : అమెరికాలో దుండగుల కాల్పుల్లో మరణించిన గోపికృష్ణ మృతదేహం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చేరుకుంది. వారం క్రితం అమెరికా డల్లాస్ లోని సూపర్ మార్కెట్ లో జరిగిన కాల్పుల్లో గోపీకృష్ణ మృతి చెందారు. అమెరికాలోని భారత ఎంబసీ, తానా సహకారంతో గోపి మృతదేహన్ని స్వగ్రామానికి తరలించారు. గోపీకృష్ణ మృతదేహం స్వస్థలానికి చేరుకోవటంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులకు అతని లేని లోటు తీర్చలేమని, అతని కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

భారత కాలమానం ప్రకారం శనివారం (22-06-2024) మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్‌లో ఉండగా ఓ దుండగుడు తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గోపీకృష్ణ మృతి చెందారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య ప్రవల్లిక, ఏడాది కుమారుడు రిషిత్‌ ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.