గోదావరి ఉగ్రరూపం - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన - Godavari River Over Flow in Alluri - GODAVARI RIVER OVER FLOW IN ALLURI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2024, 4:32 PM IST
Godavari River Over Flow in Alluri District : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి జిల్లా దేవీపట్నంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గండి పోచమ్మ అమ్మవారి ఆలయం చుట్టూ పెద్ద ఎత్తున గోదావరి నీరు చేరింది. దీంతో ఆలయానికి భక్తుల రాకపోకలు నిలిపేశారు. ముందస్తుగా భక్తులను నిలుపుదల చేశారు. వెలగపల్లి వద్ద సీత వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోండటంతో గుంపెనపల్లి, లక్ష్మీపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెలగపల్లి ఆర్అండ్బీ (R&B) రహదారి వాగు నీటిలో మునిగింది. గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో ముంపు ప్రాంతాల వాసులు ఎంతగానో నష్టపోయారు. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మళ్లీ వానలు వారిని భయాందోళనలకు గురి చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. అల్లూరి జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే కురిసిన వానలతో రాకపోకలకు ప్రమాదకరమైన వాగులు దాటాల్సి వస్తుందని గిరిపుత్రులు ఆవేదన చెందుతున్నారు.