వైభవంగా దుర్గామల్లేశ్వర స్వామివార్ల గిరిప్రదక్షిణ - అలరించిన బేతాళ నృత్యాలు - Indrakeeladri Giri Pradakshina - INDRAKEELADRI GIRI PRADAKSHINA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 19, 2024, 3:41 PM IST
Giri Pradakshina Conducted at Vijayawada Kanaka Durga Temple : శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ అత్యంత భక్తిశ్రద్ధల మధ్య సాగింది. దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. లోక కళ్యాణార్థం, భక్తుల శ్రేయస్సు, ధర్మ ప్రచారం కోసం గిరిప్రదక్షణ చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి ఉత్సవమూర్తులకు పూజలు చేసి గిరి ప్రదక్షణ ప్రారంభించారు.
ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎస్ రామారావు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేదపండితులు, భక్త బృందాలతో గిరిప్రదక్షణ చేశారు. కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాళ నృత్యాల సాంస్కృతిక కార్యక్రమాల నడుమ కొండచుట్టూ ప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గిరిప్రదక్షిణ ఎంతో వైభవంగా సాగింది. పౌర్ణమి సందర్భంగా ధ్యాన మహాయజ్ఞం కూడా చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.