బ్రిటిషర్లను మించిపోయిన జగన్ - రాష్ట్రంలో రాక్షస పాలన అంతం కావాలి : మాజీ మంత్రి కొణతాల - Konatala Ramakrishna comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 12:52 PM IST
Former Minister Konatala Ramakrishna Meeting In Anakapalli: రాష్ట్రంలో సీఎం జగన్ బ్రిటిష్ వారి కంటే దారుణమైన పాలన అందిస్తున్నారని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ధ్వజమెత్తారు. ఈరోజు అనకాపల్లిలో జనసైనికుల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతొందని, వచ్చే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని పేర్కొన్నారు.
Ramakrishna Comments On YSRCP Government: దుర్యోధనుడు లాంటి జగన్‌ను ఓడించడానికి శ్రీకృష్ణుడు, అర్జునుడిలా చంద్రబాబు, పవన్ కలిసి పోరాడుతున్నారని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకుని, పరిశ్రమలు వచ్చి, యువతకు ఉద్యోగాలు రావాలంటే జనసేనతోనే సాధ్యమని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. జనసేనకు కేటాయించిన సీట్లు తక్కువే అయినప్పటికీ, ఆ స్థానాల్లో ఉన్న అభ్యర్ధిని గెలిపించడానికి ముఖ్యమైన నాయకులు అక్కడికి వెళ్లి కృషి చేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.