వైఎస్సార్సీపీ అభ్యర్థులపై జగన్‌కే స్పష్టత లేదు- సజ్జల రాజకీయ బ్రోకర్ : జవహర్ - జవహర్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 4:37 PM IST
Former minister Jawahar comment on CM Jagan : టిక్కెట్ల విషయంలోనే కాదు అన్నింటిలోనూ జగన్ గందరగోళంలో ఉన్నారని మాజీమంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ తరఫున ఎవరు పోటీ చేయబోతున్నారో జగన్‌కే స్పష్టత లేదని ఆయన అన్నారు. కరకట్ట కమల్ హాసన్ (Karakatta Kamal Haasan) గా పేరొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన డ్రామాలు కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ఆర్కే షర్మిల దగ్గరకు వెళ్లడం ఓ డ్రామా, ఇప్పుడు తిరిగి వైఎస్సార్సీపీలోకి రావడం మరో డ్రామా అని అన్నారు. షర్మిల వద్దకు ఆర్కే ఎందుకెళ్లారో తిరిగి వైఎస్సార్సీపలోకి ఎందుకు వస్తున్నారో ఆయనే సమాధానం చెప్పాలని జవహర్ పేర్కొన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఓ రాజకీయ బ్రోకర్ (Political Broker) అని జవహర్ దుయ్యబట్టారు. దళితులని చంపిన వారికి బోకేలు ఇప్పించడమే సజ్జల అర్హత అని మండిపడ్డారు. చంద్రబాబు సవాల్ విసిరి మూడు రోజులైనా జగన్ స్పందించ లేదని విమర్శించారు. నిజమైన పెత్తందారు జగనేనని అన్నారు. ఇద్దరు మనుషుల కోసం జగన్ ఆరు ఇళ్లు నిర్మించుకున్నారన్న జవహర్, లండన్‌లో కూడా జగన్ ఓ ప్యాలెస్ నిర్మించుకున్నారని ధ్వజమెత్తారు.