LIVE : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రెస్‌మీట్ - BRS Bhavan live - BRS BHAVAN LIVE
🎬 Watch Now: Feature Video
Published : Jun 23, 2024, 3:07 PM IST
|Updated : Jun 23, 2024, 3:31 PM IST
BRS Jagdish Reddy live : రుణమాఫీని ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికి వర్తింపజేయాలని, మాజీమంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ హామీలు నీటి బుడగలే అని అర్థం అవుతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా చేస్తామని చెప్పి, ఇప్పుడు కిసాన్ సమ్మాన్ నిధి షరతులు వర్తిపజేయాలని చూడటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక, ఎలా మోసం చేశారో ప్రజలకు అర్థమైందన్నారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే మాట మారుస్తున్నారని, హామీల నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలకు అనుభవంలోకి వచ్చాయన్నారు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇవ్వని వారు, ఏడాదికి లక్ష ఇస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచే దేశం మొత్తాన్ని మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. పార్టీ మారిన వారిని పక్కన పెట్టుకొని, పార్టీ మారితే ఆ క్షణంలోనే సభ్యత్వం రద్దు చేస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదమన్నారు.
Last Updated : Jun 23, 2024, 3:31 PM IST