LIVE : తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న హరీశ్‌రావు - Harish Rao live - HARISH RAO LIVE
🎬 Watch Now: Feature Video
Published : Aug 17, 2024, 1:06 PM IST
|Updated : Aug 17, 2024, 1:40 PM IST
HARISH RAO LIVE : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ద్రోహానికి మాత్రమే కాదని, దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డారని మాజీమంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్ రావు అన్నారు. రుణమాఫీ హామీపై మాట తప్పారని, ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేనన్న విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరన్న ఆయన అబద్దం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉందని వ్యాఖ్యానించారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా నిస్సిగ్గుగా బీఆర్ఎస్పై, తనపై అవాకులు చెవాకులు పేలారని మండిపడ్డారు. మరోవైపు శుక్రవారం బీఆర్ఎస్ విలీనంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తున్నారు. సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే లక్షణం మోసమే విధానం మాట తప్పడమే నైజం అనే విధంగా తన నిజస్వరూపాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ బట్టబయలు చేసుకున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మాజీమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతున్నారు.
Last Updated : Aug 17, 2024, 1:40 PM IST