అర్ధరాత్రి ఇంటి ముందు మొసలి ప్రత్యక్షం - ఉలిక్కిపడ్డ కుటుంబం - Huge Crocodile Enters in House - HUGE CROCODILE ENTERS IN HOUSE
🎬 Watch Now: Feature Video
Published : Aug 6, 2024, 1:18 PM IST
Crocodile Entered House In Wanaparthy : 8 అడుగుల పొడవు, 90 కిలోల బరువు ఉన్న మొసలి అర్ధరాత్రి ఓ ఇంటి ముందు ప్రత్యక్షమైంది. దీంతో ఇంట్లో వాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం జానంపేటలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి కుక్కలు మొరుగుతుండటంతో మెళకువ వచ్చిన నాగన్న బయటకు వచ్చి చూశాడు. అతడికి ఇంటి ముందు భారీ మొసలి కనిపించింది. భారీ మొసలిని చూసి కంగుతిన్న నాగన్న, వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు.
స్థానికులు అటవీ శాఖ అధికారులతో పాటుగా స్నేక్ సొసైటీ నిర్వాహకులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి, మరుగుదొడ్డి పక్కనే ఉన్న సందులోకి వెళ్లిన మొసలిని తాళ్లతో బంధించారు. అనంతరం రంగాపురం వద్ద కృష్ణా నదిలో వదిలిపెట్టారు. గ్రామ సమీపంలో ఉన్న చెరువు నుంచి పొలాల ద్వారా దారి తప్పి, ఇంటి ముందుకు వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు.