హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు - పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు గుర్తింపు - Food Safety Officers Raid On Hotels
🎬 Watch Now: Feature Video
Published : May 26, 2024, 6:50 PM IST
Food Safety Officers Raid On Hotels : కరీంనగర్ నగరంలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సంబంధిత అధికారి అమృతశ్రీ నేతృత్వంలో నగరంలోని శ్వేతహోటల్లో తనిఖీలు నిర్వహించారు. హోటల్లోని ప్రతిచోట పరిశీలించిన ఆహారభద్రత అధికారులు అక్కడ ఉన్న పరిస్థితులు చూసి నివ్వెరపోయారు. ఈ సందర్భంగా హొటళ్లో కాలం చెల్లిన ఆహారనిల్వలను గుర్తించారు. తనిఖీల్లో భాగంగా స్టోర్ రూంను పరిశీలించినపుడు వారికి కాలం చెల్లిన మసాలా దినుసులు దర్శనమిచ్చాయి.
అధికారుల తనిఖీల్లో హోటల్ స్టోర్ రూంలో కాలం చెల్లిన మసాల దినుసులు, ఐస్‌క్రీంలు, మిగిలి పోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. నగరంలో ఇప్పటికే తనిఖీలు చేపట్టిన కొన్ని హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశామని ఆమె వెల్లడించారు. కరీంనగర్లో తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని ఫుడ్ సేఫ్టీ అధికారి అమృతశ్రీ పేర్కొన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు. హోటళ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని దీనిపై సంబంధిత యజమాన్యాలకు నోటీసులు జారీచేస్తామని వెల్లడించారు.