పోలవరం ప్రొజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తికి మరోసారి గడువు పెట్టిన కేంద్రం - పోలవరంపై కేంద్ర జల్‌శక్తి శాఖ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 11:46 AM IST
Deadline For Completion in First Phase Construction Of Polavaram Project: పోలవరం ప్రాజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తి చేయడానికి తాజా గడువును 2026 మార్చిగా నిర్ధారించినట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడూ తెలిపారు. గురువారం లోక్‌సభలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు.
Jal shakti Union Minister Bisweshwar Tudu about Polavaram Project: 437 వేల హెక్టార్లకు సాగునీటిని అందించే సామర్థ్యంతో పొలవరం ప్రాజెక్టును ప్రతిపాదించారని, ఆ సామర్థ్యాన్ని ఇంకా పెంచాల్సి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏపీలోని 8 ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన- ఏఐబీపీ (Accelerated Irrigation Benefit Program) కింద కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా నిధులు సమకూరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. అందులో మద్దిగడ్డ ప్రాజెక్టు ఒక్కటే పూర్తయిందని వెల్లడించారు. ఇంకా 7 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు టుడూ వివరించారు.