శ్రీవారిని దర్శించుకున్న శ్రియా - సెల్ఫీ కోసం అభిమానులు పోటీ - tirumala visit film actress

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 4:36 PM IST

Film Actress Shriya Saran Visited Tirumala Srivari : తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి శ్రియా సరన్​ దర్శించుకుంది. ఇవాళ వీఐపీ విరామ దర్శన సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్లొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు శ్రియా సరన్​కు ఘన​ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులను చెల్లించుకున్నారు.

Fans Competed to Take Selfies with Shriya : శ్రియా సరన్​ శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన అందాలనటి శ్రియాతో పలువురు ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు పోటీపడ్డారు. తమ కుటుంబలతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అభిమానులు తనపై చూసిన ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.