YUVA - ఈసే యాప్​తో నిర్మాణరంగ సమగ్ర సమాచారం - రూపొందించిన తండ్రీకుమారులు - Yuva on ESAY APP - YUVA ON ESAY APP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 3:52 PM IST

ESAY App for Civil Engineering : నిర్మాణ రంగం అంటేనే కష్టతరమైనది. నిర్మాణం చేపట్టే సమయంలో ఏదో ఒక వెలితి వెంటాడుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సామాన్యుల నుంచి గుత్తేదారుల వరకు నిర్మాణ రంగానికి అవసరమయ్యే సర్వ సమాచారాన్ని అందించాలని తండ్రీకుమారులు నిర్ణయించారు. ఒకరి ఆలోలచనలకు మరొకరు సాంకేతికతను జోడించారు. నిర్మాణ రంగం సమగ్ర సమాచారాన్ని యాప్​లో నిక్షిప్తం చేశారు. ఒక్క క్లిక్​తోనే సమాచారం తెలుసుకునేలా ఇంజినీరింగ్ ఏ రౌండ్స్ ఫర్ యూ (ఈసే) యాప్​ను తీసుకొచ్చారు. 

జాతీయ స్థాయిలో కన్​స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్​మెంట్ కౌన్సిల్ (సీఐడీసీ) ఈసే యాప్​కు విశ్వకర్మ అవార్డుల సందర్భంగా ఇన్నోవేషన్ అవార్డును బహూకరించింది. సాప్ట్​వేర్ ఇంజినీర్ చేతన్ నూతనంగా ఆలోచించి ఈసే యాప్ రూపకల్పన చేశారు. యాప్​లో సామాన్యులు ఎదుర్కొనే సమస్యలను తన అనుభవాలను జోడించాలని అతడి తండ్రి విశ్రాంత చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ రావు సూచించారు. ఇంతకీ ఈసే యాప్​లో ఏ అంశాలు అందుబాటులో ఉన్నాయి? వీటితో సామాన్యులకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? తదితర అంశాలపై ఆ రూపకర్తలతో ఈటీవీభారత్​ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.