ఐపీ పెట్టి ఉడాయించిన మిర్చి వ్యాపారి- హైవే నిర్బంధించిన రైతులు - Farmers Protest At NTR District - FARMERS PROTEST AT NTR DISTRICT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 12:38 PM IST
Farmers Protest At NTR District : వ్యాపారి మోసం చేశాడంటూ ఎన్టీఆర్ (NTR) జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్ద మిర్చి రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై ఎడ్లబండ్లను అడ్డంగా ఉంచి ఆందోళనకు దిగారు. పెనుగంచిప్రోలు మండలం వెంకటాపురం, కొల్లికూల్ల గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు కంచికచర్లకు చెందిన వ్యాపారికి సుమారు కోటి విలువైన మిర్చి విక్రయించారు. ఆ డబ్బులు ఇవ్వకుండా వ్యాపారి ఐపీ పెట్టి ఉడాయించాడు.
Trader Cheated Farmers : బాధిత రైతులు పెనుగంచిప్రోలు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. నెల రోజులైనా పురోగతి లేకపోవడంతో అన్నదాతలు తోటచర్ల వద్ద ఎడ్లబండతో జాతీయ రహదారిని దిగ్బంధించారు. తాము కష్టపడి, చమటోడ్చి పండించిన పంట చేతికందాక ఇలా మోసం చెయ్యడం దారుణమని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు మా కష్టం కనపడటం లేదా అని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే చూడమని అధికారులను వేడుకుంటున్నారు.