సమ్మతి లేకుండా ప్లాట్ల కేటాయింపులపై అభ్యంతరం- లాటరీ విధానం ఆపేయాలంటున్న అమరావతి రైతులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 27, 2024, 4:00 PM IST
Farmers of Amaravati Who are Suffering from the Actions of the Authorities : రైతుల నుంచి ఎలాంటి సమ్మతి తీసుకోకుండానే ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు అన్నదాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ నిర్వహిస్తున్న లాటరీ విధానాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై సీఆర్డీఏ కమిషనర్‌కు వినతిపత్రము ఇచ్చారు. నిబంధనలకు విరద్ధంగా నిర్వహిస్తున్న లాటరీ విధానాన్ని తక్షణమే నిలుపుదల చేయకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చారించారు.
ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయింపుకు రైతులు అభ్యంతరం పెట్టిన సీఆర్డీఏ మొండి వైఖరి ప్రదర్శస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పడి వరకు రెండు విడతల లాటరీల్లో వచ్చిన వారికి మాత్రమే ప్లాట్లను కేటాయించారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అధికారుల వేధింపులను తట్టుకోలేక 280 మంది మరణించారని తెలియజేశారు. అధికారులు తీసుకుంటున్న చర్యల వలన రైతులు తీవ్రమైన మానసిక శోభను అనుభవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యతిరేకంగా తీసుకున్న చర్యలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.