కృష్ణా జిల్లాలో భారీ వర్షం - వరి నారు మడులు పోస్తున్న అన్నదాతలు - Farmers Happy Pouring Rice Paddies
🎬 Watch Now: Feature Video
Farmers Happy With Incessant Rain in Krishna District: కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆయా మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో కేవలం వర్షాలపై ఆధారపడి రైతులు సాగు చేస్తుంటారు. వరి నారు మడులు పోసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలతో వరి సాగుకు ఉపక్రమించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాల ఆవర్తన కారణంగా కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదవుతోంది. అధికంగా వర్షాలు కురుస్తుండటంతో కొన్ని ప్రదేశాలల్లో వాగులు, వంకలు కూడా పొంగిపోర్లుతున్నాయి. మన్యం మండలాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అక్కడి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పోలవరం, వేలేరుపాడు, టి. నరసాపురం, కొయ్యలగూడెం తదితర మండలాల్లో రహదారులు నీట మునిగాయి. చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. కొయ్యలగూడెం, పోలవరంలో అధిక వర్షపాతం నమోదైంది. పోలవరానికి కూడా వరద క్రమంగా పెరుగుతోంది.