ఉద్యోగంలో సవాళ్లను దాటుకుంటూ ముందుకెళ్లడమే నిజమైన సక్సెస్ : దీపికాపాటిల్ ఐపీఎస్ - Deepika IPS - DEEPIKA IPS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 9:11 AM IST
F2F With Anakapalli SP Deepika IPS: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చాలామంది అహర్నిశలు శ్రమిస్తుంటారు. దేశంలో అత్యున్నత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్స్ సర్వీసెస్ పరీక్ష అంటే మాటలా. అందులో ఉద్యోగం సాధించి ప్రజలకు సేవలు చేయాలని చాలా మంది కలలు కంటారు. కొంత మంది ఐపీఎస్‌నే డ్రీమ్ జాబ్‌గా భావిస్తారు. నిరంతరం శ్రమించి ఉద్యోగం సాధిస్తారు. ఆమె కూడా అదే కోవకు చెందుతుంది. మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ కొలువు సాధించి ఔరా అనిపించింది. వివిధ స్థాయిల్లో పనిచేసి ఇప్పుడు అనకాపల్లి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించింది.
సివిల్ సర్వీసు సాధించడం కన్నా ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను దాటుకుంటూ వెళ్లడమే నిజమైన సక్సెస్ అని అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపికాపాటిల్ పేర్కొన్నారు. సృష్టమైన లక్ష్యం ఎంచుకోని దాని కోసం నిరంతరం కష్టపడాలని యువతకు సూచించారు. చెడు స్నేహితులకు, వ్యసనాలకు దూరంగా ఉండాలని హితువు పలికారు. జీవితంలో ఎంత కష్టపడితే అంత పైకి వెళ్లుతారని పేర్కొన్నారు.