అప్పట్లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి దాడి- ఎన్నికల్లో లబ్ధి కోసమే జగన్​ డ్రామాలు : న్యాయవాది సలీమ్ - Jagan Stone Case Lawer Saleem - JAGAN STONE CASE LAWER SALEEM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2024, 9:24 AM IST

F2F With Jagan Stone Case Suspect Lawer Saleem : ఎన్నికల్లో లబ్ధి కోసమే వైఎస్సార్సీపీ నేతలు గులకరాయి దాడి డ్రామాకు తెరతీశారని న్యాయవాది సలీమ్‌ ఆరోపించారు. ఈ కేసులో నిందితుడు సతీష్‌కు బెయిల్‌ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కోడికత్తి పేరుతో దళితుడైన శ్రీనివాస్‌ను ఇబ్బంది పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం గులకరాయి పేరుతో వెనుకబడిన వర్గాలకు చెందిన సతీష్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో 'రావాలి జగన్‌, చెప్పాలి సాక్ష్యం' అని వాఖ్యానించారు.

జగన్ మోహన్ రెడ్డి నేరావృత వ్యక్తిగా విజయవాడ కోర్ట్ కు విన్నవించానని, ప్రతి ఎన్నికల ముందు ఆయన పై ఆయనే దాడి చేసుకుని ప్రజల సానుభూతి పొందుతాడని వాదించానని సలీమ్​ పేర్కొన్నారు. గత ఎన్నికలో కోడికత్తి కేసులో జనుపల్లి శ్రీనివాస్​ను ఇబ్బంది పెడితే ఈ సారి ఎన్నికకు గులకరాయి కేసులో సతీష్​ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. కోడికత్తి కేసులో దళితుడైన శ్రీనివాస్, ఈ కేసులో వెనుక బడిన వర్గానికి చెందిన సతీష్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం సాగింది అన్నారు. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడంతో వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.