ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు- సమస్యగా మారిన వాహనాల పార్కింగ్ - Indrakiladri durgamma temple - INDRAKILADRI DURGAMMA TEMPLE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 23, 2024, 2:37 PM IST
F2F With Indrakiladri Temple EO KS Rama Rao in Vijayawada : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు వేసవి సెలవుల నేపథ్యంలో భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. సాధారణ రోజుల్లో 25 వేల నుంచి 30 వేల మంది భక్తులు వచ్చే వారని ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ప్రత్యేక రోజుల్లో 50 వేల మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడమే కాకుండా సొంత వాహనాలతో వస్తుండడం వల్ల పార్కింగ్ పెద్ద సమస్యగా మారిందని కేఎస్ రామారావు తెలియజేశారు. కనకదుర్గా నగర్‌లో అభివృద్ధి పనులు చేస్తుండడం వల్ల వాహనాల పార్కింగ్ స్థలం కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు త్వరగా అమ్మవారి దర్శనం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నిరకాల ఏర్పాట్లు చేశామని కేఎస్ రామారావు వ్యాఖ్యానించారు.