'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమం - etv vote awareness anantapur
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 4:41 PM IST
ETV Eenadu Awareness conference on voter registration And Vote Awareness : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈటీవీ- ఈనాడు ఆధ్వర్యంలో ఓటు హక్కు నమోదు, ఓటరు చైతన్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కళ్యాణదుర్గం జ్యోతిర్మయి బాలికల కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, స్థానిక ఆర్డీవో కార్యాలయ సిబ్బంది పాల్గొని ఓటు ప్రాధాన్యత గురించి విద్యార్థినులకు వివరించారు. ఓటు వినియోగం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి నాయకుడ్ని ఎన్నుకోవాలి? అన్న విషయాలపై అవగాహన కల్పించారు. ఇప్పటివరకు ఓటు లేని విద్యార్థులకు ఫారం-6 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.
Anantapur District : ఈటీవీ - ఈనాడు నిర్వహించిన ఓటు అవగాహన కార్యక్రమం వల్ల ఓటు ప్రాధాన్యత తెలుసుకున్నామని విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓటు ద్వారా సమర్థులైన నాయకులను ఎన్నుకోవడం వల్ల ప్రజలకు మంచి పరిపాలన అందుతున్న విషయాన్ని తెలుసుకున్నామని పేర్కొన్నారు. ఓటు లేని వారు ఓటును నమోదు చేసుకున్నామని తెలియజేశారు.