టీడీపీతోనే సంక్షేమం, అభివృద్ధి- ప్రజలు మార్పు కోరుతున్నారు : ఎన్ఎండీ ఫరూఖ్ - Nandyal TDP candidate NMD Farooq - NANDYAL TDP CANDIDATE NMD FAROOQ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 1:32 PM IST
ETV Bharat Interview with Nandyal TDP candidate NMD Farooq : వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో మండుటెండలనూ లెక్కచేయకుండా కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే ఆత్మీయ సమావేశాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రచారాల్లో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు చేసింది ఏమీ లేదని నంద్యాల కూటమి అభ్యర్థి ఎన్ఎండీ ఫరూఖ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామని, ముస్లిం సోదరులంతా తమ పార్టీ పక్షానే ఉన్నారని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ పథకాలకు విశేష ఆదరణ లభిస్తోందని, తమ ప్రభుత్వం వస్తే సంక్షేమం, అభివృద్ధి రెండూ చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. జగన్ అరాచక పాలన అంతం చేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని చెబుతున్న ఎన్ఎండీ ఫరూఖ్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి.